
మెగాస్టార్ చిరు అభిమానులకి ఆయన పుట్టిన రోజు న ఫుల్ ఖుషి చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా ఆయన కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా టైటిల్ను ప్రకటించారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి ‘భోళా శంకర్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ టైటిల్ని మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. చిరు మూవీ టైటిల్ రివీల్ చేస్తూ, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మంచి విజయాలు సాధించాలని మహేష్ ఆకాంక్షించారు. ఈ సినిమాలో నయనతార, సత్య దేవ్ ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని చూపించే ఈ చిత్రంలో చిరుకి సోదరిగా కీర్తి సురేశ్ కనిపించే అవకాశాలున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
Happy birthday @KChiruTweets garu? Honoured to be unveiling the title of your film! #BholaaShankar, under the directorial skills of my good friend @MeherRamesh and my favourite producer @AnilSunkara1 garu
May the year ahead bring you great health and success. All the best sir! pic.twitter.com/U9czmnIK5I
— Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2021