
రాజకీయ ఎన్నికల మాదిరి రసవత్తరంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో గెలుపొంది అనేక హామీలు ఇచ్చిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ మధ్యనే మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం కమిటీ ప్రకటించిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా మరో బిగ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. అక్టోబరు 31న ఓ ఎగ్జైటింగ్ న్యూస్ చెబుతానని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది ‘మా’ కు సంబంధించిన విషయమని, చాలా పెద్ద వార్త అని తెలిపారు.
Have an exciting news to share on 31st October, in regards to #MAA ❤️. It’s gonna be a big one ??
— Vishnu Manchu (@iVishnuManchu) October 29, 2021
ఇటీవల ‘మా’ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు తన ప్యానెల్ తరఫున అనేక హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడమే తన తక్షణ కర్తవ్యమని ప్రమాణస్వీకారం సందర్భంగా వెల్లడించారు. ప్రత్యర్థి ప్యానెల్ రాజీనామాలను ఆమోదించని మంచు విష్ణు… ప్రకాశ్ రాజ్ వర్గం కూడా తనకు సహకరించాలని కోరారు.