
మంచు మనోజ్ త్వరలోనే రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ ఫారెన్ అమ్మాయితో మనోజ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెను వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పుడూ ఈ వార్తలపై స్పందించని మంచు మనోజ్..ఈసారి మాత్రం సైలెంట్‌గా ఉండాలనుకోలేదు.
తన రెండో పెళ్లి గురించి వార్త రాసిన సదరు మాధ్యమంపై తనదైన శైలిలో సెటైరికల్‌గా స్పందించారు. సదరు లింక్‌ను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఆ పెళ్లికి దయచేసి నన్ను కూడా ఆహ్వానించండి. ఇంతకీ పెళ్లి ఎక్కడా.? ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు.? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం’ అంటూ సెటైర్ వేశాడు. ఈ ట్వీట్‌తో మనోజ్ రెండో పెళ్లికి సంబంధించిన పుకార్లకి పులిస్టాప్ పడింది.
కాగా 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ సుమారు నాలుగేళ్ల అనంతరం వారి వైవాహికి జీవితానికి ముగింపు పలికారు. 2019లో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం మనోజ్ సినిమాలపైనే దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఆయన ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. తన సొంత బ్యానర్లో.. ఎంఎం ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నట్టు ఇటీవల మనోజ్ ప్రకటించడంతో పాటు కోపం. శాంతం, ఆనందం కనిపించేలా మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న పోస్టర్‌ను ఫస్ట్‌లుక్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.