
మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన సవాల్‌ను స్వీకరించలేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాదిన మంత్రి, రేవంత్ రెడ్డి ఏవో కొన్ని పేపర్లు తీసుకొచ్చి తనపై కబ్జా ఆరోపణలు చేశారన్నారు.
తన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని రేవంత్ రెడ్డి అబద్ధాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏవో పేపర్లు చూపించి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి రేవంత్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీని మీద అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు కి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అన్ని అనుమతులతోనే హాస్పటల్ కట్టాం. పేద ప్రజల కోసమే ఆసుపత్రి కట్టానని, ఎలాంటి అవకతవకలు జరగలేదని’’ మల్లారెడ్డి అన్నారు.
‘‘ రేవంత్‌రెడ్డి ఏవో జిరాక్స్ పేపర్లు పట్టుకొని వచ్చి షో చేసాడు. పొద్దంతా అబద్ధాలు చెప్పటమే పనిగా పెట్టుకున్నాడు. నా కోడలు పేరు మీద ఉంది 5 ఎకరాలు కాదు 350 గజాలే. ఆ స్థలంలో హాస్పిటల్ కట్టాను. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. బట్టకాల్చి మీద వేయటమే రేవంత్ రెడ్డి పని’’ అంటూ మల్లారెడ్డి నిప్పులు చెరిగారు.