
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా, పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగు, కొన్ని రోజులుగా ‘స్పెయిన్’లో జరుగుతోంది. హైదరాబాద్ .. గోవా .. దుబాయ్ లలో ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్స్ ను ఇంతకుముందే పూర్తిచేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాల కోసం, ఒకటి రెండు పాటల కోసం ఈ సినిమా టీమ్ ఇటీవల స్పెయిన్ వెళ్లింది. అక్కడ కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా పాట చిత్రీకరణతో అక్కడ షెడ్యూల్ ముగిసింది. ఆ రోజు ఈ సినిమా సెట్స్ లో నమ్రత సందడి చేసింది.
హీరోయిన్ కీర్తీ సురేష్ తో మహేష్ భార్య నమ్రత కలిసి మాట్లాడుతున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. ఇందులో వారు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఈ బ్యూటీఫుల్ పిక్ తెగ వైరల్ అవుతోంది. సర్కారు వారి పాట సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.