
సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ . ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్ తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ లో ‘సర్కారు వారి పాట’ కూడా ఒకటి.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి సూపర్ స్టార్ బర్త్ డేకి వచ్చిన స్పెషల్ వీడియో మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. సంగీతం తమన్ అందిస్తున్న ఈ సినిమాలో పాటల పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.