
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ గారు అనారోగ్యంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే కదా. కృష్ణగారు ఆకస్మికంగా ఆసుపత్రి పాలు కావడంతో ముందుగా కొంత గందరగోళ వాతావరణం ఏర్పడినా హాస్పిటల్ యాజమాన్యం కృష్ణగారి ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ హెల్త్ బులెటిన్ విడుదల చెయ్యడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా తండ్రిని చూసి పలకరించడానికి మహేష్ కొంతసేపటి క్రితమే కాంటినెంటల్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఈ మేరకు హాస్పిటల్ లో మహేష్ నడుస్తున్న వీడియో ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. కృష్ణగారు ఆరోగ్యంగా తిరిగి రావాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాక ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు.