
లైటింగ్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు, సోడాల శ్రీదేవి పాత్రలో ఆనంది నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ ట్రైలర్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా గురువారం విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ ను ఎంజాయ్ చేశామన్న మహేశ్.. హీరో సుధీర్ బాబుకు, చిత్ర యూనిట్ కు ‘గుడ్ లక్’ చెప్పారు. విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కరుణ కుమార్. “ప్రేమకి పెద్దలు ఎదురుతిరగడం, హీరో తన ప్రేమ కోసం ఎంతకైనా తెగించడం” ఈ ట్రైలర్ లో ఆవిష్కరించారు. రొమాన్స్ తో పాటు ఎమోషన్ కూడా చూపించారు. యువతను, మాస్ ను ఆకట్టుకునేలా అనిపిస్తోంది. ఈ చిత్రంలో ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది.
Here's the trailer of #SrideviSodaCenter Absolutely enjoyed it! Looking forward to its release in the cinemas. Good luck to @isudheerbabu and the entire team!https://t.co/Ykox3cYwIf@anandhiactress @70mmEntertains @Karunafilmmaker #ManiSharma
— Mahesh Babu (@urstrulyMahesh) August 19, 2021