
Maharashtra: బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా రేపు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కంధార్ నియోజకవర్గంలో దాదాపు 15 ఏకరాల విస్తీర్ణంలో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు.