
హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై 400కి పైగా ఓట్ల భారీ మెజారిటీతో విష్ణు విజయం సాధించారు. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. చివరి వరకు ప్రకాష్ రాజ్ కూడా పోటీ ఇచ్చినట్లే కనిపించినా కూడా.. చివరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ఈయన వైపే ‘మా’ సభ్యులు ఎక్కువగా మొగ్గు చూపారు. ప్రకాష్ రాజ్‌ను నటుడిగా ఆదరించినా కూడా.. అధ్యక్షుడిగా మాత్రం చూడలేమని ఓపెన్‌గానే చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇదే నిజమైంది.
మంచు విష్ణు ప్యానెల్ కు ఇప్పటికే ట్రెజరర్ (కోశాధికారి), జనరల్ సెక్రటరీ పదవులు లభించడం తెలిసిందే. ట్రెజరర్ గా శివబాలాజీ, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్ నుంచి పృథ్వీ రాజ్ విజయం సాధించారు. ముందు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలో మంచు విష్ణు విజయం సాధించాడు.
విష్ణు ప్యానల్లో గెలిచిన మెంబర్స్
అధ్యక్షుడిగా మంచు విష్ణు
జనరల్ సెక్రటరీగా రఘుబాబు
వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి
ట్రెజరర్‌గా శివబాలాజీ
జాయింట్ సెక్రటరీ గౌతం రాజు
ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో గెలిచిన మెంబర్స్
వైస్ ప్రెసిడెంట్‌గా హేమ
జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్
ఈసీ సభ్యులు వీళ్లే..
మంచు విష్ణు ప్యానెల్లో మాణిక్, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత, సంపూర్ణేశ్ బాబు ఈసీ సభ్యులుగా గెలుపొందారు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ సభ్యులుగా శివారెడ్డితోపాటు కౌశిక్, యాంకర్ అనసూయ, సురేశ్ కొండేటి, బ్రహ్మాజీ, ఖయ్యుం, ప్రగతి గెలుపొందారు.