
శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం ఈ నెల 19న ఏర్పడనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ (నాసా) ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రుడు – సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి … భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక గ్రహణం కారణంగా చంద్రుని ఉపరితలం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది.
భారత్ లోని అసోం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణాన్ని మనం చూడవచ్చు. అలాగే ఉత్తర అమెరికా, మెక్సికో దేశ ప్రజలు కూడా ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పుఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు ఈ పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది.