
దేశవ్యాప్తంగా మరోసారి వంట గ్యాస్ ధర పెరిగింది. నేటి నుంచి కొత్త ధరలను అమల్లోకి తెచ్చారు.
ఎల్పీజీ సిలిండర్ ధర రూ.15 చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.899.50కి, హైదరాబాద్లో రూ.952కి పెరిగింది. రెండు నెలల్లో వంటగ్యాస్ ధర నాలుగో సారి పెంచారు. ఈ ఏడాది మొత్తం కలిపి వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 205 పెరిగింది.
కాగా, పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. లీటర్ డీజిల్ ధర 35 పైసలు, పెట్రోలు ధర 30 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.94గా ఉండగా, డీజిల్ ధర రూ.91.42గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోలు రూ.100.49గా, డీజిల్ ధర రూ.95.93గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ.107.09గా ఉండగా, డీజిల్ ధర రూ.99.75కి చేరింది.