
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన చిత్రం ‘లవ్ స్టోరీ’. అన్ని వర్గా ప్రేక్షకులను అలరించింది ఈ సినిమా . ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ప్రేమకథ చిత్రాలలో టాప్ లో వుంది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు నిర్మించారు.

ఈ ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలైన తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకుంది. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లకు పెద్ద సంఖ్యలో జనాలను రప్పించిన సినిమా ఇది. కథా కథనాల పరంగా .. పాటల పరంగా .. డాన్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటు చైతూ .. అటు సాయిపల్లవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది.

అలాంటి ఈ సినిమాను ఇప్పుడు మలయాళంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ప్రేమ తీరం’ అనే టైటిల్ తో ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళంలో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. అందువలన అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.