
పవన్ కళ్యాణ్, రానా కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ రచన సాహిత్యం లో ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ ఈ రోజు విడుదల అయింది. ఈ రోజు త్రివిక్రమ్ జన్మదినం . ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ రచించిన పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కి రీమేక్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘లాలా భీమ్లా’ అంటూ కొనసాగుతోన్న ఈ పాట అభిమానులను అలరిస్తోంది.
థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు సంబంధించిన ఫొటోలను కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.