
మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడు. అలాగే లలాట అధిదేవత బ్రహ్మ. లలాటం బ్రహ్మ స్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. కావున బ్రహ్మ స్థానమైన లలాటాన ఎరుపు రంగు బొట్టు ధరించాలి. అనగా కుంకుమ ధరించాలి. లలాటాన సూర్యకిరణాలు తాకరాదు. మనలోని జీవి, జ్యోతి స్వరూపుడిగా భ్రుమధ్యభాగంలోని ఆజ్ఞాచక్రం లో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కుంకుమను ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. నడివేలు ధరిస్తే ఆయుష్షు సమృద్ధి చెందుతుంది. బొటనవ్రేలితో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడువేలితో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతాయి. ఎప్పుడైతే నుదుటన కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞాన చక్రాన్ని పూజించినట్లు అవుతుంది. కుంకుమ బొట్టును ధరించండి వల్ల పవిత్ర భావనలు కలుగుతాయి.