
అఫ్గాన్ విషయంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమ దేశంలో అస్థిర పరిస్థితులపై ప్రపంచ దేశాల నేతలు స్పందించాలని అఫ్గానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ… కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ నుంచి వస్తున్న వీడియోలు, చిత్రాలు తననెంతగానో కలచి వేస్తున్నాయని అన్నారు. అఫ్గానిస్తాన్ అల్లకల్లోలం అవుతుంటే ప్రపంచ దేశాధినేతలు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.
కాగా, అప్గానిస్థాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో స్థానిక పౌరుల జీవనం, వారి భవిష్యత్తుపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పౌరులు ఇతర దేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నారు. అనేక దేశాలు అప్గానిస్థాన్ నుండి దౌత్య కార్యాలయాల సిబ్బందిని, ఇతర సిబ్బందిని తరలిస్తున్నాయి.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ తాజా పరిణామాలపై స్పందించారు. అప్గానిస్థాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్న వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. మహిళల, మైనారిటీలు, బాలికల రక్షణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పిలుపునివ్వాలని, ఆఫ్గన్లకు సహాయం అందించాలని ట్వీట్ చేశారు.
Where is the UN? Aren’t you @UN supposed to intervene when situations become horrendous!!
Truly disturbing visuals from #AfganistanCrisis #StayStrongAfghanistan https://t.co/fj67UglZKj
— KTR (@KTRTRS) August 16, 2021