
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో ఉందని మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోందని పేర్కొన్నారు. సనత్ నగర్ లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రికి టెక్ మహీంద్ర ఫౌండేషన్ ప్రతినిధులు అందజేసిన ఏడు అంబులెన్స్ లు, ఆక్సిజన్ ప్లాంట్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. మహీంద్ర గ్రూప్ అనేక రంగాల్లో దూసుకుపోతుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహీంద్ర యూనివర్సిటీ ఏర్పాటు కావడం గర్వకారణమని అన్నారు. వారి సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కరోనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్ లు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు.