
లార్డ్స్ లో జరిగిన ఇంగ్లాండ్, భారత్ టెస్ట్ మ్యాచ్ అనంతరం మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్న కెఎల్ రాహుల్ మీడియా తో మాట్లాడాడు. ఇంగ్లాండ్ టీం కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు రాహుల్. ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్ పదే పదే బుమ్రా ని టార్గెట్ చేయడం, నోటికి పని చెప్పడం, డబ్లు తగిలేలా బాల్స్ వేయడం ఇవన్నీ చేసినటువంటి రాహుల్ ఘాటుగా మాట్లాడాడు. ‘ మీరు మాలో ఒకడిని టార్గెట్ చేస్తే మేము పదకొండు మంది మీ అందరిని టార్గెట్ చేస్తాము ” అంటూ గట్టి గ వార్నింగ్ ఇచ్చాడు. గొప్ప జట్లు గొప్ప ఆట కనబరిస్తే కొత్త కొత్త నైపుణ్యాలు కనిపిస్తాయి. ఆటలో అవి భాగమే కానీ ఇలా స్లెడ్జ్ చేస్తూ కవ్విస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఈ రోజు శ్రమించిన గొప్ప జట్టు గెలించినందుకు చాల సంతషంగా వుంది. రెండు మంచి నైపుణ్యం వున్నా జట్లు గెలుపు కోసం తలపడ్డాయి. టీం ఇండియా గెలించినందుకు ఆనందంగా వుంది అంటూ మాట్లాడాడు.