
టాలీవుడ్ నవ మన్మథుడిగా పేరు గాంచిన నాగార్జున ఈ ఏడాది ‘వైల్డ్ డాగ్’ తో మంచి హిట్ కొట్టారు. తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేస్తున్న నాగార్జున… కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ అనే ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. నేడు నాగార్జున బర్త్ డే. అందుకే ఆయన నటిస్తున్న సినిమాల నుండి లుక్స్ అండ్ టైటిల్స్, అలాగే నిన్న బర్త్ డే సీడీపీలని రిలీజ్ చేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు. ఇక, ప్రవీణ్ సత్తారు సినిమా కరోనా వలన కొద్ది రోజులు ఆగింది. ఇటీవల తిరిగి మొదలుపెట్టారు. ఈ రోజు నాగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. ‘ది ఘోస్ట్’ అనే టైటిల్‌తో చిత్రం తెరకెక్కనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్‌తో నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని వర్షంలో నడుస్తున్నట్టు ఉన్నారు నాగ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.