
Kantara Movie 300Cr: ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది.
‘కాంతార’ చిత్రం తాజాగా రూ.300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. కన్నడలో రూ.160 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో రూ.60 కోట్లు, తమిళంలో 10 కోట్లు, హిందీలో రూ.62 కోట్లు, మలయాళంలో రూ.15 కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. ఇక ఈ సినిమా అల్లు అరవింద్‌కు దాదాపు పది రెట్లు లాభాలు తీసుకొచ్చింది.