
Kamal Haasan Birthday: కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కమల్ అప్ కమింగ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇండియన్ 2 మూవీ టీం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ, స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో ఇండియన్ మొదటి భాగంలోని గార్డ్ గెటప్ లో కమల్ కనిపిస్తున్నారు.
కమల్ హాసన్… విలక్షణతకు మారుపేరు, ట్యాలెంట్ కి కేరాఫ్ అడ్రెస్. 1954, నవంబర్ 7న మద్రాస్ లో జన్మించిన కమల్ ఆరేళ్ళ పసి ప్రాయంలోనే వెండితెరకు పరిచయమయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రెసిడెన్షియల్ అవార్డును కూడా అందుకున్నారు.
4 నేషనల్ ఫిలిం అవార్డులు, 20 ఫిలింఫేర్ అవార్డులు, పద్మ శ్రీ, పద్మ భూషణ్…ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ అందుకున్న అవార్డుల లిస్ట్ ఇప్పుడప్పుడే పూర్తవ్వదు. చివరిగా , ఇండియా నుండి అకాడెమి అవార్డులకు ఏడుసార్లు నామినేట్ ఐన సినిమాలు కమల్ సొంతం.