
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ స్పందించారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు అదీ..ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అని జూ.ఎన్టీఆర్ అన్నారు. ఆడబిడ్డలను గౌరవించడం మన సంప్రదాయమని, మన సంప్రదాయాలను రాబోయే తరానికి అందివ్వాలన్నారు.
ఈ మాటలు వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబసభ్యుడిగా మాట్లాడడం లేదన్నారు. ఈ మాటలను నేను వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన ఒక పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతూన్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం ఇంతటితో ఆపండి. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా. అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
— Jr NTR (@tarak9999) November 20, 2021