
వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో సీఎం కేసీఆర్ పాత్ర ఉందంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం సీఎం కేసిఆర్ చేసిన ధర్నా వల్లే కేంద్రం ఆ చట్టాలను రద్దు చేసిందని పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పీయూసీ) చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసిన రైతుబంధు చట్టాలను అద్భుత చట్టాలుగా అభివర్ణిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరహాలో ధాన్యం కొనుగోళ్లలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
