
Janasena: గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన వారిని జనసేన ఆదుకుంటుందని, కుటుంబానికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళవారం పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ చర్యలకు ఇళ్లు కోల్పోయిన వారికి అండగా ఉండాలని పార్టీ చీఫ్ నిర్ణయించారని, ఈ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తన చేతులతో బాధితులకు అందజేస్తారని వివరించారు.