
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌లోని కీలక నేతలకు లేఖలు రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్, టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీలు బోస్ రాజు, శ్రీనివాసన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజెషన్ ఇంచార్జ్ మహేష్ గౌడ్ వీరందరికి లేఖలు రాశారు. ప్రతి నెల ఆయన చేసే పనులు, వాటి ఆంతర్యం ఏంటో ఆ లేఖలో వివరించారు.
నెలలో 20 రోజులు ఎమ్మెల్యేగా సంగారెడ్డి నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుందని, 6 రోజులు రెండు మున్సిపాలిటీ వార్డుల్లో నిరంతర కార్యక్రమాలు, సమస్యలపై ప్రజలతో చర్చించడం, వారు చెప్పిన వాటికి పరిష్కార మార్గాలు వెతకడం ప్రజలతో కలువడం జరుగుతుందని, ప్రెసిడెంట్‌గా 10 రోజులు పార్టీకి కేటాయించడం జరుగుతుందని, ఈ పది రోజుల్లో ప్రతి నెల 4 రోజులు పార్లమెంట్ ఇంచార్జి గా ఉన్న ఖమ్మం, భువనగిరి, కరీంనగర్, వరంగల్ పార్లమెంట్లకు సమయం కేటాయించి అక్కడ ముఖ్యనేతలతో కలిసి పార్టీ కోసం సమన్వయం చేయడం జరుగుతుందని లేఖలో జగ్గారెడ్డి ప్రస్తావించారు.