
Itlu Maredumilli Prajaneekam: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న 59వ సినిమా “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”. AR మోహన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దందా నిర్మించారు. నవంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఆల్రెడీ నిన్న థియేటర్లలో స్క్రీనింగ్ ఐన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు మారేడుమిల్లి గ్రామంలో చిత్రబృందం డిజిటల్ లాంచ్ చెయ్యనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు ట్రైలర్ డిజిటల్ లాంచ్ కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.