
ఏడవ నిజాం మనుమడిని తానేనని, నిజాం కి సంబంధించిన ఆస్తులను తాను అమ్ముతున్నాను అంటున్న దాంట్లో వాస్తవం లేదని దిల్షాద్ జా అన్నారు. నిజాం ఆస్తులకు హక్కుదారు నేనేనని ఆయన అన్నారు. హైదర్ గూడా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కిస్మత్ పుర లో దర్గా హజ్రత్ ఖలీజ్ హాన్ లో వున్నా ఐదు ఎకరాల భూమికి తానే పూర్తి హక్కుదారుడు అని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. నిజాం అకాఫ్ కమిటీ కి చెందిన స్థలాన్ని తాను అమ్ముతున్నానని, ఆ కమిటీలో ఉన్న సయ్యద్ ఖాద్రి ఫయాజ్ ఖాన్, ఫాయిజ్ జంగ్ చేసిన ఆరోపణలు తప్పని అన్నారు. 1984 నుండి నిజాం ఆస్తులు తానే కాపాడుతున్నానని మీడియాకు తెలిపారు. నిజాం అకాఫ్ కమిటీ అధికారిక కమిటీ కాదని, ఆ స్థలానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ అంశం పై కోర్ట్ కు వెళ్లనున్నట్లు తెలిపారు