
హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు ఎత్తి నీటికి కిందకి వదిలిపెడుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ శివారులోని హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు జలాశయం రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం లో 1763. 05 అడుగులకు నీరు చేరింది. సుమారు రెండు వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.