
చిన్నారి చైత్ర ఘటనకు సంబంధించిన షాకింగ్ న్యూస్, సైదాబాద్ సింగరేణి కాలనీ లో జరిగిన ఆరేళ్ల బాలిక చిన్నారి చైత్ర పై అఘాయిత్యానికి పాల్పడిన రాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనపడ్డాడు. అతడు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి రెండు చేతులపై మౌనిక అని ఉండే పచ్చ బొట్టుతో అది అతడి మృతదేహమేనని స్పష్టమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.