
నేడు హుజురాబాద్‌లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి బలమూర్ వెంకట్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. నేడు బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సైతం ప్రచారం నిర్వహించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంటలో చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జమ్మికుంట, హుజురాబాద్, వీణవంకలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.