
హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఘర్షణ చోటుచేసుకుంటోంది. వీణవంక మండలం గనుముక్కులలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. స్థానికేతరులు ఎందుకు వచ్చారని నిలదీశారు. టిఆర్ఎస్ కు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారని కౌశిక్ రెడ్డితో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.