
హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేతనైతే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి కాదని, కాంగ్రెస్-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అని ఆరోపించారు. చీకటి ఒప్పందాలతో ఈ రెండు పార్టీలు పనిచేస్తాయన్నారు. ఈటల, రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని, ఏడాదిన్నర తర్వాత ఈటల చేరేది కాంగ్రెస్ గూటికేనని అన్నారు.