
Hero Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న కొత్త చిత్రం “జపాన్” నుండి ఈ రోజు అంటే నవంబర్ 14న ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్ టైం ను తెలుపుతూ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఐదింటికి జపాన్ గా కార్తీ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కార్తీ కెరీర్ లో 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతున్నట్టు అధికారిక ప్రకటన జరిగింది. ఈ ప్రాజెక్ట్ ను రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తుండగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.