
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ లో బస్సు స్టాండ్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జి భారీ వర్షాల కారణంగా కుప్ప కూలింది. మూలవాగు పై నిర్మితమవుతున్న వంతెన సెంట్రింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో మూడు రోజుల నుండి కురుస్తున్న ఎడతెరపి వర్షాల వల్ల, వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో వంతెన సెంట్రింగ్ కూలిపోయింది. నిర్మాణ సమయంలోనే వంతెన కూలిపోవడం పై అధికారుల నిర్లక్ష్యం పై ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ వంతెనలు నిర్మిస్తున్నారు.