
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర పోవడం అందరికీ ఈ మధ్య అలవాటైపోతుంది. లాక్ డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండడంతో మరియు వర్క్ ఫ్రొం హోమ్ కారణంగా మధ్యాహ్న భోజనం తరువాత అలసిపోయి నిద్రపోతున్నారు.
అయితే ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందట. కాకపోతే కొందరు మాత్రం మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర పోతే చాలా మంచిది అని భావిస్తారు. భోజనం కాగానే నిద్ర రావడం సహజమే అయినప్పటికీ నిపుణులు మాత్రం ఇలా చేయకూడదు అని చెబుతున్నారు.
భోజనం అయ్యాక నిద్ర పోవడం వల్ల కడుపులోని దీన రసాలు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆహారం వైపు వస్తాయట దాంతో ఆమ్ల స్వభావం కారణంగా గొంతు లో మంట ఏర్పడుతుంది. అంతే కాకుండా భోజనం చేయగానే పడుకున్న అందువల్ల ఒత్తిడి మొత్తం జీర్ణాశయం పైనే పడుతుందట. దానివల్ల గురక వస్తుంది. అందుకే భోజనం అయ్యాక గంట తర్వాత నిద్ర పోవడం మంచిది. అని సలహా ఇస్తున్నారు నిపుణులు.