
నోటి అల్సర్ అంటే కొంత మందికి అవగాహన లేకపోవచ్చు ,నోటి పుండ్లు అంటారు. అదేనండి నోటి లోపల అనగా పెదవుల లోపలి భాగంలో , దవడ లోపలి చిగురు భాగంలో కొన్ని చోట్ల గుండ్రంగా ఆకారంలో పుండ్లు ఏర్పడుతుంటాయి ఆలా వచ్చే వాటినే నోటి అల్సర్ అంటారు.
ఇవి రావడానికి కారణం మన శరీరంలో ఎక్కువగా వేడి ఉండటం ,నోరు శుభ్రంగా లేకపోవడం , మనం తీసుకొనే ఆహరం వల్ల కూడా ఇవి ఏర్పడటానికి అవకాశం ఉంది . ఐతే వీటి వలన చాల ఇబ్బంది ఎదుర్కొంటూఉంటాము . సరిగా ఆహరం తీసుకోలేము, ఎక్కువగా మాట్లాడలేము , నోరు తెరవాలంటే మంట , దీని వలన కళ్లలోనుండి నీళ్లు రావడం , దవడ లోపల చర్మం పొక్కడం లాంటివి జరుగుతుంటాయి .
వీటిని నివారించడానికి మార్కెట్ లో చాల రకాల పూత మందులు అందుబాటులో ఉన్నాయి . అవి దాదాపుగా పది నిమిషాల కాల వ్యవధిలోనే నొప్పి , మంట నుండి ఉపశమనం కలిగిస్తాయి . అలానే ఒక వారం రోజుల్లో వీటిని తగ్గించడానికి దోహదపడతాయి . ఐతే వీటిని సమండిత వైద్యుని సలహా మేరకు ఉపయోగించమని సలహా. ఎందుకనగా ఎన్నో ప్రొడక్ట్స్ లభ్యం అవుతున్న కానీ కొన్ని సరిగ్గా పని చేయవు అనగా బయట కొన్ని నకిలీ కూడా దొరికే అవకాశం ఉంది అనే అభిప్రాయం .
ఐతే , వీటిని ఇంట్లోనే సహజ పద్దతిలో కూడా తొలిగించవచ్చు . అది ఎలానో ఇప్పుడు చూద్దాం .
ఉప్పు నోటిలోని బ్యాక్టీరియాను గణనీయంగా తగ్గించడంలో మౌత్ వాష్ కన్నా సమర్థవంతంగా పని చేస్తుంది. గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి,ప్రతి రోజు రెండుసార్లు పుక్కిలించడం వలన మౌత్ అల్సర్లతో పాటు నోటికి సంబంధించిన ఇతర సమస్యలను నియంత్రించుకోవచ్చు.
తులసి ఆకులు నాటి కాలం నుండి నాటు వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి . వీటిలో ఇన్ఫెక్షన్ ని తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ కనీసం రెండు సార్లు తులసి ఆకులను నమిలి, కొద్దిసేపటి తరువాత వేడి నీటిని పుక్కిలిస్తే మౌత్ అల్సర్ల సమస్య తగ్గుతుంది .
కొబ్బరినూనె , పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని వీటి మీద పూయడం వలన కూడా మంచి ఫలితం పొందవచ్చు . అలానే కొంచెం తేనే , పసుపు కలిపి రాయడం వలన కూడా ఈ సమస్యని అధికమించవచ్చు . నోటి అల్సర్లను తేలికగా తీసుకుంటే , వీటి వలన ఇన్ఫెక్షన్ చేరి అవి పెద్దగా మారి నోటి కాన్సర్ లాంటి రోగాలు రావడానికి అవకాశాలు లేకపోలేదు జాగర్త .