
క్యారెట్ నారింజ రంగులో మిలమిలా మెరిసే ఈ దుంప జాతి కూరగాయ ఆరోగ్యమే కాదు.. అందాన్నీపెంపొందిస్తుంది. అయితే క్యారెట్ వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాలు మీకు తెలిసినవే . క్యారెట్ శరీరానికి శక్తిని అందించినట్లే.. సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. క్యారెట్లో బీటా కెరోటిన్లూ, విటమిన్-A, విటమిన్-C, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. అయితే మీ మేను మెరవాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి.
❂ 4 స్పూన్ల క్యారెట్ జ్యూస్‌లో 2 స్పూన్ల బొప్పాయి జ్యూస్, అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు ముఖం కాంతివంతంగా మారుతుంది.
❂ క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మీద మడతలు మాయమవుతాయి.
❂ ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చాలు ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.
❂ ముఖం మీద మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపండి. అనంతరం దాన్ని ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకోండి. తప్పకుండా మీ ముఖం మీద మొటిమలు తగ్గుతాయి.