
కొవిడ్ మహమ్మారి భూ మండంలపైన సృష్టించిన అల్లకల్లోలం గురించి అంతా ఇంతా కాదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొవిడ్ మహమ్మారి బారిన పడి చాలా మంది పిట్టలు రాలినట్లు రాలారు. కాగా, కొవిడ్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను జనాలు భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడంతో పాటు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొవిడ్ బారిన పడకుండా జనాలు జాగ్రత్త పడుతున్నారు.
తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే, ఇంతలోనే డెంగ్యూ జ్వారాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బొప్పాయి ఆకు రసం వల్ల కొంచెం రికవరీ అవుతున్నారు. బొప్పాయి ఆకు రసం వల్ల మనుషుల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. పిల్లల నుంచి పెద్దల వరకు డెంగ్యూ ఫీవర్‌తో పోరాడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ డెంగ్యూ ఫీవర్ వలన రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోతున్నాయి. కాగా, బొప్పాయి ఆకురసం ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ప్లేట్లెట్స్ కౌంట్ పెంచడంలోనూ బొప్పాయి ఆకు రసం బాగా పని చేస్తుంది. మన పూర్వీకులు ఈ బొప్పాయి ఆకురసం తీసుకుంటుండేవారని పెద్దలు చెప్తుంటారు కూడా. బొప్పాయి ఆకు రసంలో ఉండే యాసిడ్స్, గ్లూకోసైడ్స్, గ్లూకోసినోలెట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్‌కు చాలా ముఖ్యమైనవి. ఇవి హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ పెంచడంలోనూ కీ రోల్ ప్లే చేస్తాయి. మొత్తంగా బొప్పాయి ఆకు రసం సహజమైన దివ్య ఔషధంగా పని చేస్తుంది. బొప్పాయి ఆకు రసం వల్ల కలిగే ప్రయోజనాలపై పలు అధ్యయనాలు ఆల్రెడీ జరిగాయి. రక్తకణాలు, ప్లేట్లెట్స్ పెంచడంలో పపాయా లీవ్స్ జ్యూస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తేలింది.
సాధారణంగానే బొప్పాయి పండు తినడం చాలా మందికి ఇష్టముంటుంది. అయితే, అందరు కూడా ఈ పండు తినాలని, ప్రతీ ఒక్కరు ఈ పండు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల జనంలో హెల్త్‌పై కాన్షియస్ పెరిగినందున వారికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వడమ ముఖ్యమని నిపుణులు అంటున్నారు. డెంగ్యూ ఫీవర్ వచ్చినపుడు ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం ప్రధానమైన లక్షణంగా ఉన్నందున వాటిని పెంచడానికి బొప్పాయి ఆకు రసం ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రతీ ఒక్కరు బొప్పాయి ఆకురసం తీసుకోవడం మంచిదేనని అంటున్నారు.