
* కొబ్బరి పాలు మరియు నిమ్మరసంను ఉపయోగించి జుట్టును స్ట్రెయిట్ చేసుకోవడం
కొబ్బరిపాలు మరియు నిమ్మరసం రెండు సమభాగాలుగా తీసుకుని చక్కగా కలిపి ముందురోజు రాత్రి ఫ్రీడ్జ్ లో పెట్టాలి మరునాటి ఉదయం చక్కగా తలకుపట్టించి 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో, తక్కువ గాడత కలిగిన శాంపో ఉపయోగించి తల స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి తలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన జుట్టు చక్కగా పట్టులా మృదువుగా మారడమే కాకుండా స్ట్రైట్ గా అవుతుంది.
* హెయిర్ స్ట్రెయిట్నింగ్ కోసం హాట్ ఆయిల్ ట్రీట్ మెంట్‌ను వాడడం.
ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ రెండిటిని చక్కగా కలపాలి. అనంతరం ఈ రెండు రకాల నూనెలు కొద్దిగా వెచ్చగా అయ్యే వరకు వాటిని స్టవ్ మీద ఉంచి వేడిచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించండి. జుట్టుకు మొత్తం ఆ నూనెను రాసిన తర్వాత.. ఓ 15 నిముషాల పాటు మీ తలను మసాజ్ చేయండి. తర్వాత ఆ మిశ్రమాన్ని రాసిన మీ హెయిర్‌ను మరో 30 నిముషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మీ తలను చల్లని నీటితో షాంపూ చేయాలి. షాంపూలో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. ఈ పద్దతిని వారానికి రెండు సార్లు కనుక ఫాలో అయితే మీ జుట్టు స్ట్రెయిట్ గా సిల్కీగా స్మూత్‌గా అవుతుంది.
* మిల్క్ స్ప్రే విధానం.
కొద్దిగా పాలను తీసుకుని స్ప్రే బాటిల్లో పోయాలి. ఇలా స్ప్రే బాటిల్లో పోసిన పాలను మీ జుట్టు మొత్తం తడిచే వరకు స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేసిన తర్వాత 30 నిముషాల పాటు అలాగే వదిలేయాలి. అటు తర్వాత చల్లని నీటితో జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి.
వారానికి 1-2 సార్లు. మీ సమయాన్ని బట్టి ఈ విధానంలో మన జుట్టును ఆరోగ్యకరంగా ఉంచుకునేందుకు వీలుంటుంది. ఎక్కువ బిజీగా ఉన్న వారు వారానికి ఒక రోజు మాత్రమే పాలతో స్ర్పే చేసి జుట్టును శుభ్రం చేసుకుంటారు. కానీ తక్కువ బిజీగా ఉండి టైమ్ ఉన్న వాళ్లు ఈ విధానం ద్వారా జుట్టును వారానికి రెండు సార్లు కూడా శుభ్రం చేసుకోవచ్చు.
ఈ విధానం వలన జుట్టు స్ట్రెయిట్ అవడంతో పాటు స్మూత్‌గా కూడా తయారవుతుంది. పాలల్లో ఉండే ప్రొటీన్ల వలన మన జుట్టుకు అనేక పోషకాలు అందుతాయి. వీటన్నింటి వలన మీ జుట్టు మీరు లీవ్ చేసినా సరే చిక్కుముడులు పడకుండా స్ట్రెయిట్‌గా ఉంటుంది. అంతే కాకుండా మీ జుట్టు కూడా చాలా స్మూత్‌గా కనిపిస్తుంది.