
ఖాళీ కడుపుతో వెల్లుల్లి టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది. జీర్ణ శక్తి పెంచడంలో కూడా వెల్లుల్లి టీ బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు పంపించడంలో వెల్లుల్లి టీ దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతీరోజూ వెల్లుల్లి టీ తాగితే.. బరువు నియంత్రణలో ఉంటుంది.
బరువు కూడా సులువుగా తగ్గవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు.. శరీరం చురుకుగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రక్తప్రసరణను పెంచి.. బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఉదర సమస్యలను దూరం చేసి.. అజీర్తి, ఎసిడిటీ సమస్యలను నివారిస్తుంది.
అందుకే ప్రతిరోజూ ఐదారు వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఘాటు తగ్గించుకునేందుకు కొంచెం తేనె కలుపుకుంటే సరిపోతుంది.