
పొద్దున్నే ‘టీ’ తాగడం చాలా మందికి అలవాటు. అయితే, తరచూ టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది చెబుతుంటారు. కానీ రోజుకు ఒకసారైనా బ్లాక్ టీ తాగాలని అమెరికన్ పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు. వేడివేడి ‘టీ’ తాగడం వల్ల శరీరానికి ఉత్తేజం వస్తుందని వారు చెబుతున్నారు. చాలా మంది కాస్త అలసట, ఒత్తిడి అనిపించగానే చిక్కటి టీ ని తాగుతారు. టీ అనేది క్యాన్సర్, ఊబకాయం లాంటి సమస్యలు దరి చేరకుండా చూస్తుందని పరిశోధనల్లో తేలింది. రోజూ బ్లాక్ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యకరంగా ఉంటుందట. బ్లాక్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుతున్నారు. అంతేకాకుండా బ్లాక్ టీ ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. మలబద్ధ్దకం సమస్యకు సైతం చెక్ పెడుతుందని పరిశోధకులు నిర్ధారిస్తున్నారు. కాకపోతే టీ లో చక్కెర స్థానంలో తేనె, బెల్లం మొదలైన సహజ తీపి పదార్థాలను జోడిస్తే మంచిదని చెబుతున్నారు.