
కొంతమందికి ఎప్పుడు జరిగిన విషయం గురించి కాసేపటి తరువాత అడిగితే గుర్తులేదు మర్చిపోయాం అని చెప్పడం మనం వింటుంటాం. ఆలాగే కొంతమంది పిల్లలు ఉదయాన్నే లేచి కష్టపడి పరీక్షలకు చదువుకుని వెళతారు. తీరా పరీక్ష హాల్ లోకి వెళ్ళగానే చదివింది గుర్తుకు రాక సతమతం అవుతూ ఉంటారు. ఈ సమస్యనే మతిమరుపు అంటారు. ఈ మతిమరుపు అనేది వయసు పెరగడం వలన వస్తే పరవాలేదు. అదే చిన్న వయసులో గనుక ఇలా మర్చిపోతున్నారు అంటే ఆలోచినచవలసిన విషయమే. మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు చూడండి..
* ప్రతి రోజు ఉదయం పూట రెండు కోడిగుడ్ల లోని పచ్చసొనను హాఫ్ లీటర్ పాలలో కలుపుకొని తాగితే మెదడుకు బలం కలిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* ఒక మూడు నెలల పాటు దాల్చిన చెక్క ముక్కలను రోజుకు నాలుగు ముక్కల చొప్పున నమలి, ఆ రసమును మింగుతూ ఉంటే మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
* తెల్లదింటేన చెట్టు వేరును బుగ్గన పెట్టుకొని, ఆ రసం మింగుతూ ఉంటే జ్ఞాపకశక్తి పెరిగి చదివిన విషయాలు గుర్తు ఉంటాయి.
* శుభ్రం చేసిన సోంపు గింజలను హాఫ్ కేజీ తీసుకొచ్చి అందులో హాఫ్ కేజీ పటిక బెల్లం కలపాలి. ఈ రెంటిని చక్కగా పొడిచేసుకొని ఒక డబ్బాలో జాగ్రత్తగా నిల్వ చేసుకుని. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత ఈ పొడిని కొద్దిగా నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
* నీడలో ఆరబెట్టి ఎండించిన సరస్వతీ ఆకులు ఐదు తులాలు, పావుతులం మిరియాలు కలిపి పొడిచేసి ఒక సీసాలో పోసుకుని పరుచుకోవాలి. ఈ పొడిని రోజు ఉదయం మంచి నీళ్ళలో కలుపుకుని తాగితే జ్ఞాపకశక్తి బాగా వృద్ధి చెందుతుంది.