
ఉలవచారు రుచిని ప్రశ్నించగలవరెవరు .? అంత అద్భుతంగా ఉంటుంది. అన్నిరకాల వాత వ్యాధులున్నవారు, ముఖ్యంగా వాత వ్యాధితో భాదపడేవారికి చక్కగా, నిర్భయంగా ఉలవచారు ఇవ్వండి. అలాగే షుగర్ రోగులు కూడా ఈ ఉలవచారు సేవించవచ్చు. మూత్రపిండాలలో రాళ్లున్నవారు ఈ ఉలవచారుని రోజు తాగితే రాళ్ళు త్వరగా కరిగేందుకు తోడ్పడతాయట. అలాగే ముల్లంగి అకుగాని,దుంపగానీ దంచి ఆ రసాన్ని ఉలవచారుతో కలిపి తీస్కుంటే రాళ్ళు ఇంకా త్వరగా కరిగిపోతయట. దాంతోపాటు ఉబ్బసం, క్షయ, కడుపులోనోప్పి, ప్లేగు వ్యాధులతో భాదపడేవారు ఉలవచారుని తరుచు తీస్కుంటే మంచిదట. ఉలవలు, బియ్యం కలిపి పుల్లగం లా వండి ఆ పులగాన్ని రోజు తిన్నట్లైతే పిన చెప్పిన వ్యాధులన్ని చక్కగా ఎదుర్కొంటుందట ….అలాగే పులగం వండేటప్పుడు వార్చిన గంజిని తాగిన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.