
-బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.
-బొప్పాయి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా పని చేస్తుంది.
-ఈ పండులో ఉండే పొటాషియం, క్యాల్షియం, మినరల్స్, మెగ్నీషియం వంటి పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
-బొప్పాయి ఆకుల్లో పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. మీరు గర్భవతి అయితే, అది శిశువులకు విషపూరితం కావచ్చు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కొంత కాలం బొప్పాయిని తినకుండా ఉండడమే మంచిది.
-ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అయితే ఎక్కువ విటమిన్ సి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
-మగవారు ఎక్కువగా బొప్పాయి తింటే సంతానోత్పత్తి పై కూడా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
– ఈ పండు రోజూ తినడం వలన కొంతమంది చర్మం రంగుమారుతుంది. కళ్ళు తెల్లగా అవుతాయి. చేతులు ఆకుపచ్చ గా మారే అవకాశం ఉంది.
-ఈ పండు ఎక్కువగా తింటే ఇది అన్నవాహికను దెబ్బతీస్తుంది.
-హైబీపీ మందులు వాడే వారు ఎక్కువగా బొప్పాయిని తింటే, అది మీ రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
అందువల్ల మితంగా తినడం ద్వారా బొప్పాయి ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నించండి.