
ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ధనియాలలో వుండే పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె, సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం మెండుగా ఉంటాయి. నిత్యం ధనియాల కషాయం తాగుతుంటే మధుమేహం అదుపులో వుంటుంది. ధనియాలలో వుండే లక్షణాల తత్వం టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతాయి . శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ధనియాల కషాయంలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే బాగా నిద్రపడుతుంది. కషాయాన్ని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పసుపులో ధనియాల పొడి లేదా రసాన్ని కలిపి మొటిమలపై రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
ధనియాలను నూనె లేదా నెయ్యిలో వేయించి కొద్దిగా ఉప్పు, కారం కలిపి పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలుపుకుని తింటే అజీర్ణం, విరేచనాలు తగ్గుతాయి.