
మెంతి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులో అనేక విటమిన్లు ,పోషక పదార్థాలతో పాటు విటమిన్ ‘కె’ కూడా లభిస్తుంది.
-జీర్ణక్రియ సంబంధిత సమస్యలైన గ్యాస్ట్రిటిస్, మలబద్ధకం,కడుపు నొప్పులను నివారిస్తుంది.
-మెంతి ఆకులు డయాబెటిస్‌ను అరికడతాయి.
-మెంతి ఆకుల్లో ఉండే గ్లూకోజ్ జీవక్రియను నిరోధించగలదు. ముఖ్యంగా టైప్2 డయాబెటిస్ నివారణకు సహాయపడుతుంది.
-మెంతి ఆకులు గుండెలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.
-మూత్రపిండాల సమస్యల నుంచి రక్షిస్తుంది
-నోటి పూత, బెరిబెరి వ్యాధులకు చెక్ పెడుతుంది.
– పాలిచ్చే తల్లులు మెంతికూరను తింటే అధికంగా పాలు పడతాయి.
-మెంతి ఆకుల పొడిని ఉపయోగించి తయారుచేసిన హెర్బల్ టీ అధిక జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
-మెంతి ఆకులు మహిళలకు ఎంతో ఆరోగ్య ప్రయాణాలను ఇస్తాయి. కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి.
-మెంతి ఆకు లాలాజల గ్రంధుల పనితీరును పెంచుతుంది.
-రక్తహీనతతో బాధపడేవారికి ఈ ఆకు మంచి ఔషధం.
-ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది,
-రాత్రి సమయంలో 100 గ్రాముల మెంతి ఆకులను నీటిలో ఉంచి, మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి తింటే చాల మంచిది.
-మెంతి ఆకు అజీర్తి , గ్యాస్ట్రిక్ సమస్యలు, వివిధ పేగు సంబంధిత సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుంది.