
* ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కుని వెన్నపూస గాని, కొబ్బరి నూనె గాని పై పూతగా పూస్తే పగుళ్లు వెంటనే మానిపోతాయి.
* తుమ్మ జిగురును నీటితో ముద్దగా నూరి కాలి పగుళ్ల పైన పట్టించుచుండిన పగుళ్లు తగ్గి పాదాలు కోమలంగా తయారవును.
* కొద్దిగా తేనె తీసుకుని వెచ్చచేసి ఇందులో కాస్త గేదెవెన్న ను కలిపి సీసాలో పోసి భద్రపరచుకోవాలి. ఈ విధంగా భద్రపరిచిన మిశ్రమాన్ని ప్రతిరోజు కాళ్ళ పగుళ్ళకు రాస్తూ ఉంటే ఐదు రోజుల్లో కాళ్ళ పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి
* 5 తులాల గుగ్గిలం కొద్దిగా ఆవ నూనెలో కలిపి పోమర్దిస్తే వెన్నలాగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని కాళ్ళ పగుళ్ళకు రాస్తూ ఉంటే వారం రోజు ల్లో కాళ్ళ పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.
* బెల్లము, మైనము, గుగ్గిలము, నెయ్యి వీటిని సమభాగాలుగా కలిపి నూరి కాలి పగుళ్లకు పట్టిస్తే తొందరగా తగ్గిపోతాయి.
* ఉల్లి చెక్కను పగుళ్ల మీద రుద్దుతూ ఉంటే పగుళ్ళు తగ్గిపోతాయి.
* కొబ్బరి పాలలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి కాళ్లు చేతులు పగుళ్ళకు రాస్తూ ఉంటే పగుళ్లు తగ్గుతాయి.