
కరోనా టైంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. రకరకాల కూరగాయల్లోనే కాదు, పప్పు దినుసులతోనూ, వాటితో చేసే పచ్చళ్లతోనూ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. పప్పుల పొడి, కూర పొడి, కరివేపాకు పచ్చడి, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఆ కోవకు చెందినవే. మీరు బయట కొనుగోలు చేసే పచ్చళ్లను తింటుంటే వాటిని మానేయడం మంచిది ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి అలానే ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటి వాటిని కూడా అందులో యాడ్ చేస్తారు. కనుక వీలైనంత వరకూ ఇంట్లో తయారు చేసుకునే వాటిని తినడం మంచిది. సాధారణంగా మనం ఇంట్లో తయారు చేసుకునే ఊరగాయలుని ఉప్పు లో ఊరబెట్టి కలుపుతూ ఉంటాము. అయితే ఈ బ్యాక్టీరియా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మన అమ్మమ్మలు నానమ్మలు ఫర్ మెన్టేషన్ ప్రాసెస్ లో నూనె వేసి మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతులు ఇలా పచ్చడి ని బట్టి పదార్ధాలని ఉపయోగిస్తూ ఉంటారు.
మెంతులు, జీలకర్ర, ధనియాలు మొదలైన వాటిలో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఈ యాంటి మైక్రోబియల్ గుణాలు ఇంట్లో తయారు చేసే పచ్చడికి మాత్రమే ఉంటాయి. అలానే ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు. ఇంట్లో తయారు చేసుకునే పచ్చళ్ళు లేదా ఊరగాయల లో మంచి ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్యాక్ చేసినా లేదా ప్రాసెస్ చేసిన ఆహారం లో ఆరోగ్యం ఉండదని, కేవలం సమస్యలు మాత్రమే వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో తయారు చేసిన పచ్చడ్లు లేదా ఊరగాయలో మంచి గుణాలు ఉన్నాయని, అవి ఒబేసిటీని తరిమికొడతాయి. అంతేకాకుండా డయాబెటిస్ ను కూడా తగ్గిస్తాయి. కాబట్టి మీరు కూడా ఇంట్లొ పచ్చళ్లను తయారు చేసి తినండి. ఆరోగ్యకరమైన ఇమ్యూనిటీని పెంచుకోండి.