
ప్రస్తుతం చాలా మందిని వేధించే సర్వసాధారణమైన సమస్య ఏంటి అంటే అది ‘నిద్ర రాక పోవడం’, నిద్రలేమి అని అంటారు. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఒక మనిషి రోజుకు కనీసం ఎనిమిది గంటలు ఘాడ నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వల్ల రోజంతా అలసటగా, బద్దకంగా అనిపిస్తుంది. దానితో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన శారీరక శ్రమ లేకపోవడం , పనిలో ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల నిద్రలేమి తలెత్తుతుంది. అయితే శరీరానికి తగినంత విశ్రాంతి లభించి బాడి రీచార్జ్ అవ్వాలంటే రాత్రి ఏడెనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. కానీ చాలా వరకు రాత్రి త్వరగా నిద్ర పట్టదనో, పట్టినా మధ్యలో మెలకువ వచ్చేస్తుందనో ఎక్కువమంది చెబుతూ ఉంటారు. మీరు కూడా ఇదే సమస్యని ఫేస్ చేస్తుంటే, ఇదిగో ఇక్కడ ఉన్న సంప్రదాయ ఆయుర్వేదంలో ఉన్న చిట్కా ఒకటుంది. ట్రై చేసి చూడండి.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం రాగి, టిన్, జింక్, కంచు వంటివి ఈ విషయం లో హెల్ప్ చేస్తాయి. కాలి మడమలు కి ఆవు నెయ్యి లేదా, కోకమ్ బటర్, లేదా కొబ్బరి నూనె అప్లై చేసి కంచు పాత్ర తో మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. త్వరగా, గాఢంగా నిద్ర పడుతుంది.


పడుకోవడానికి ముందు ఆవు నేయి, కోకమ్ బటర్, కొబ్బరి నూనె (ఇదే ఆర్డర్ లో ప్రిఫరెన్స్ ఇవ్వండి) అప్లై చేసి చిన్న కంచు పాత్ర తో కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆయుర్వేదం ప్రకారం మీరు హాయిగా నిద్రపోతే శరీరానికి సెల్స్ ని బిల్డ్ చేసుకోవడానికి, రిపెయిర్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందువల్ల ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, అలసిన కళ్ళకు విశ్రాంతినిచ్చి చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.