
ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కార్పొరేట్ కంపెనీలు తయారు చేసిన తేనె బాటిళ్లల్లో లభ్యం అవుతుంది. కానీ వీటిలో కూడా ఏ తేనె స్వచ్ఛమైనదో గుర్తించడం కష్టంగా మారుతోంది. అనేక రకాల కంపెనీల ప్రకటనలు చూసి తేనె చూడ్డానికి బాగుంది. తింటే కూడా బాగుంటుందేమో అని చాలా మంది ప్రజలు మోసపోతున్నారు. తీరా తేనెను కొన్నాక వారు మోసపోయామని గ్రహిస్తున్నారు. తర్వాత చేసేదేం లేక నిశ్శబ్ధంగా ఉండిపోతున్నారు. ఇలా కల్తీ తేనెను తీసుకోవడం వలన తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల మాట అటుంచితే… అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది తేనె సీసాలను ఫ్రిడ్జ్‌లలో నిల్వ చేస్తారు. మరలా అవసరమయినపుడు తీసుకుని వాడుకుంటారు. అవసరం తీరాక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. ఇలా స్టోర్ చేసిన తేనెను వాడొచ్చా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మందిలో అనుమానాలు ఉంటాయి.
కానీ తేనెలో చెక్కర మిశ్రమాన్ని గనుక కలిపితే ఫ్రిడ్జ్‌లో పెట్టినపుడు అది గడ్డ కడుతుంది. తేనెలో కలిపిన చెక్కర మిశ్రమంలో ఉన్న చెక్కర ఫ్రిడ్జ్‌లో ఉన్న చల్లదనానికి చిన్న గుళికలుగా మారుతుంది. ఫ్రిడ్జ్‌లలో నిల్వ చేసిన తేనెను ఒకరు రోజుకు ఒక స్పూన్ మాత్రమె తీసుకోవడం ఉత్తమమం.
ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నట్లయితే హనీ అనేది తీయగా ఉంటుంది. తేనెను తీసుకున్న తర్వాత విపిక (ఆహారం జీర్ణమైన తర్వాత కాలేయంపై ప్రభావం) తీపిగా ఉంటుంది. తీయగా ఉన్నప్పటికీ దీని ప్రభావం శక్తి వంతంగా(ఉషా వీర్య) ఉంటుంది. దీని ప్రభావం వల్లే తేనెను అధికంగా తీసుకోవడం వలన మనకు కఫా, పిత్తా అనే వ్యాధులు వస్తాయి. (ఒబేసిటీ, దగ్గు, జలుబు, అధిక కొవ్వు మొదలైనవి). తేనె డ్రైగా ఉంటుంది (రుక్ష). దీనిని అధికంగా తీసుకోవడం వలన వాత దోషానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి (వాత దోషం అనగా… మలబద్ధకం, కీళ్ల నొప్పులు)
తేనెలో చెక్కర శాతం అధికంగా ఉంటుంది. కావున దీనిని అధికంగా తీసుకున్నపుడు కొన్ని సార్లు తలనొప్పి, కడుపునొప్పి, డయేరియా, విరేచనాలు కావడం జరగవచ్చు. అందుకోసమే తేనెను అధికంగా తీసుకోకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.
పేరున్న ఫిజీషియన్ చెప్పిన దాని ప్రకారం.. ఇది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుందని, అధిక మొత్తంలో తేనెను తీసుకోవడం వలన డయేరియా, జ్వరం రావడం, కడుపునొప్పి, విరేచనాలు మొ.. వస్తున్నాయని హెచ్చరించారు. అంతేకాకుండా అధిక మొత్తంలో తీసుకున్న తేనె వలన దంతాల సమస్య ఉత్పన్నమవుతుందని డాక్టర్ హెచ్చరించారు.
ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన దాని ప్రకారం గది ఉష్ణోగ్రత వద్ద తేనెను తీసుకోవడం చాలా మంచిది. (ఇలా గది ఉష్ణోగ్రత వద్ద తీసుకోవడం వలన తేనె వలన మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా తేనెను సహజ స్థితిలో తీసుకోవడం ఉత్తమం. మనం దేనినైనా సరే సహజ స్థితిలో తీసుకున్నపుడు మనకు మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రాసెస్ చేయడం వలన వస్తువు దాని సహజత్వాన్ని కోల్పోయి మనకు హాని చేసే స్థితిలోకి మారుతుంది.